![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -332 లో.. కావ్య తన పుట్టింటికి వెళ్తానని చెప్పడంతో రాజ్ దింపడానికి అత్తారింటికి వస్తాడు. లోపలికి రండి అని రాజ్ తో కనకం-కృష్ణమూర్తి అంటారు. వెళ్ళాలని రాజ్ అనగానే.. వెళ్ళాలనుకునే వారిని బలవంతం పెట్టడం ఎందుకని కావ్య అంటుంది. కనకం-కృష్ణమూర్తి ఇద్దరు రాజ్ కావ్యలేంటి ఇలా మాట్లాడుకుంటున్నారని అనుకుంటారు. ఆ తర్వాత రాజ్ వెళ్లిపోగానే కావ్యని ఏం జరిగిందో అడుగుతారు.
ఆ తర్వాత కావ్య ఏడుస్తు రాజ్ చేస్తున్న పనుల గురించి చెప్తుంది. వేరొక అమ్మయితో తిరుగుతున్నాడు.. ఆమెనే పెళ్లి చేసుకుంటాడంట అని కావ్య తన బాధని చెప్తూ ఏడుస్తుంది. అది విని వాళ్ళంతా షాక్ అవుతారు. బావ నీకు అన్యాయం చేస్తుంటే ఎలా కూర్చొని ఉంటానని అప్పు వెళ్తుంటే.. తనని కనకం ఆపుతుంది. అక్కడ ఎలాంటి ఆశ లేనప్పుడు.. ఏం చేసిన లాభం లేదని కావ్య అంటుంది. నన్ను దూరంగా పంపించాలని, ఇదంతా కావాలని ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉన్నట్లు నటిస్తున్నాడు. నేనంటే అసలు తనకి ఇష్టం లేదని కావ్య చెప్తుంది. ఆ తర్వాత రాజ్, ప్రకాష్, సుభాష్ లు ఇంటికి రాగానే కావ్య గురించి ధాన్యలక్ష్మి చెప్తుంది. ఈ ఇంటి పెద్ద కోడలికి తాళాలు అప్పగించిందో లేదో అప్పుడే రెండు లక్షలు దొంగతనం చేసిందంటూ కావ్యని నిందిస్తుంది ధాన్యలక్ష్మి. నా భార్యని దొంగ అనే హక్కు నీకు లేదు.. మా గదిలో అవసరం వచ్చినప్పుడు తీసుకోమని కొంత డబ్బు పెట్టాను.. అదే ఇప్పటివరకు తను తీసుకోలేదు. ఇక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కావ్య అసలు తీయదు. ఒక వేళ తీసిన అడిగే హక్కు లేదని రాజ్ అంటాడు. కావ్య పుట్టింటికికి వెళ్ళిందని తెలుసుకున్న ధాన్యలక్ష్మి.. ఇక డబ్బులు తీసి తన పుట్టింటికి ఇవ్వాలని వెళ్ళిందని అంటుంది. అంత అవసరం తనకి లేదని లేదని రాజ్ అంటాడు.
మరొకవైపు ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావని కావ్యని కనకం అడుగుతుంది. తన జీవితంలో నుండి తప్పుకోవాలని అనుకుంటున్నానని కావ్య అనగానే.. అప్పుడే అక్కడికి ఇందిరాదేవి వచ్చి తప్పుకొని.. ఆ తప్పు నీ మీద వేసుకుంటావా అని అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో రాజ్ ఎలా ఒక అమ్మాయితో క్లోజ్ ఉంటు నటిస్తున్నాడో నువ్వు అలాగే వేరొక అబ్బయితో క్లోజ్ గా ఉండి రాజ్ కు నీపై ఉన్న ప్రేమని బయటకు తియ్యని కావ్యతో ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |